Monday, 26 August 2013

News

  23/sept/2013.

Eenadu News

 

 24/sept/2013.

Eenadu News

 

 22/09/2013 Eedandu 

 21/sept/2013.

prajasakti News

చలో hyd.  వాల్ పోస్టర్ 

Date 17/09/2013.

Date 16/09/2013 కర్తవ్యాలు 

1          11 నుండి  18 లోపు అన్ని డివిజడిన్లో  M.L.A. లకు వినతి పత్రాలు  ఇవ్వాలి 

 

2         18 లోపు  డివిజడిన్లో  పబ్లిక్ చేత వైట్ బ్యానర్  మిద  సంతకాలు సేకరించాలి

3         19 న  జిల్లా విస్తృత సమావేశం  జరుగును

4         22 రాత్రి  డెల్టా  trine  వెక్కి జిల్లా లో ని కంప్యూటర్ టీచర్స్ అందరు  హైదరాబాద్  వెళ్ళాలి  


 Date 15/09/2013 


5-9-2013 కర్తవ్యాలు  

       1.    9 న వినాయుకునికి వినతి పత్రం ఇవ్వాలి  అది ప్రెస్ కు రావాలి 

         2.    11 వ తేదిన  D.E.O / Collector  ఆఫీసు  ముట్టడి అందరు కంప్యూటర్ టీచర్స్ రావాలి 

         3.     11 to 22 వరుకు అన్ని డివిజన్ మండలాలలో  వైట్ బ్యానర్ మీద పబ్లిక్ చేత సంతకాల సేకరణ చేయాలి  అది  ప్రెస్ న్యూస్ రావాలి 

        4.      23 న చలో హైదరాబాద్ కు జిల్లా లో వున్నా కంప్యూటర్ టీచర్స్  అందరు వచ్చేలా   నాయకత్వం పనిచేయాలి  అందర్నీ తీసుకురావాలి


10 TV LO Computer Teachers News 

   Date : 2/9/2013 time 7:30 AM
హైదరాబాద్: ముందు చూపు లేకుండా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఎంతోమంది ఉపాధిని కొల్పోతున్నారు. అంతేగాకుండా కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతోంది. దీనికి చక్కటి ఉదాహరణ 'ఐసిటి పథకం'. ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ విద్యను అందించాలని సర్కార్ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. 550 కోట్ల రూపాయలతో సదుపాయాలు ఏర్పాటు చేశారు. దాదాపు పదివేలమంది టీచర్లు కంప్యూటర్ విద్యను బోధిస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకం ముగుస్తుండడంతో టీచర్లు రోడ్డున పడనున్నారు. కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సదుపాయాలు వృథా కానున్నాయి..
విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించాలనే లక్ష్యంతో ఎంతో ఆర్బాటంగా ప్రభుత్వ పాఠశాల్లో ప్రవేశపెట్టిన 'ఐసిటి' పథకం ముగియనుంది. 6వేల 3వందల స్కూళ్లలో కంప్యూటర్‌ విద్య గల్లంతవుతోంది. 550 కోట్లతో ఏర్పాటు చేసిన సదుపాయాలు వృథా కానున్నాయి. 5 వేల స్కూళ్లలో ఈ నెలతో ఐసిటి పథకం ముగుస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పది వేల మంది కంప్యూటర్ టీచర్లు ఉపాధిని కోల్పోతున్నారు. కంప్యూటర్‌ టీచర్ల భవిష్యత్‌ ప్రశ్నార్ధకంగా మారింది. వేలాది విద్యార్థులు కంప్యూటర్‌ విద్యకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. ప్రభుత్వం కొత్త స్కూళ్లకు మరో పథకమంటూ ఊరిస్తోంది.
ప్రభుత్వ విద్యాసంస్థల్లోని పేద విద్యార్థుల కోసమంటూ కేంద్ర ప్రభుత్వం ఐసిటి పథకాన్ని ప్రారంభించింది. విద్యార్థులకు కంప్యూటర్‌ విద్య నేర్పడం ఈ పథకం లక్ష్యం. తొలి ఐదేళ్లు తాము 75 శాతం నిధులు గ్రాంట్‌గా ఇస్తామనీ, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలే మొత్తం నిధులు సమకూర్చాలని ఈ పథకం ప్రారంభంలో కేంద్రం స్పష్టం చేసింది. ప్రభుత్వం రాష్ట్రంలో 2008సం.లో ఐదువేల స్కూళ్లలోనూ, 2009సం.లో పదమూడు వందల స్కూళ్లోనూ ఐసిటి పథకాన్ని ప్రారంభించింది. 2008సం.లో ప్రారంభమైన ఈ పథకం 2013 సెప్టెంబర్‌తో ముగుస్తుంది. ఈ పథకానికి ఎంపికైన అయిదు వేల స్కూళ్లలో ఒక్కోక్క స్కూల్‌కి ఇద్దరేసి చొప్పున పది వేల మంది టీచర్లను నియమించారు. కంప్యూటర్‌ లాబ్‌ల ఏర్పాటు, మెయింటనెన్స్, టీచర్ల జీతాలు కలిపి ఈ అయిదేళ్లలో 416 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. ఇంత ఖర్చు పెట్టిన ఈ పథకానికి ప్రభుత్వం రాంరాం చెబుతోంది. దీంతో పదివేల మంది కంప్యూటర్‌ టీచర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. వీరికిప్పుడు జీతం ఇస్తున్నది అంతంత మాత్రపు జీతమే. 2012 డిసెంబర్‌ దాకా కేవలం 1800 రూపాయల జీతం మాత్రమే ఇచ్చారు. ఆ ఏడాది 104 రోజుల పాటు కంప్యూటర్‌ టీచర్ల సమ్మె చేయడంతో వేతనాన్ని 2600 రూపాయలకు పెంచారు. కానీ అంతలోనే వీరి ఉపాధికే ఎసరొచ్చింది. ఈ పథకాన్ని ముగిస్తుండడంతో వీరి భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారనుంది.
ఐసిటి పథకాన్ని ముగించి రెగ్యులర్‌ టీచర్లతో కంప్యూటర్‌ విద్య నేర్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ అది ఆచరణ సాధ్యం కాదని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఈ పథకాన్ని కొనసాగించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అదనంగా పెట్టే ఖర్చు ఏడాదికి కేవలం 60 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ పథకాన్ని కొనసాగించడం వల్ల పేద విద్యార్థులకు కంప్యూటర్‌ విద్య అందుబాటులో వుంటుంది. కంప్యూటర్‌ టీచర్ల ఉపాధికీ ఢోకా వుండదు. వాస్తవానికి కేవలం 6300 స్కూళ్లలో మాత్రమే కాకుండా, అన్ని ప్రభుత్వ స్కూళ్లలో కంప్యూటర్‌ విద్యను బోధించాల్సిన అవసరం వుంది. అప్పుడే ప్రభుత్వ విద్యార్థులు కూడా ఆ రంగంలో కనీస పరిజ్ఞానం సంపాదించుకోగలుగుతారు. 10tv Hyd.
Thanks to 10TV From CTS Guntur



సంతకాల సేకరణ  చేయవలిసిన  పేపర్    విద్యార్దులు, ఉపాద్యాయులు,  విద్యార్దుల తల్లి తండ్రులు చేత సంతకాలు చేపించాలి. 




సర్క్యులర్  ( చేయవలిసిన పనులు  )



No comments:

Post a Comment